పొంగల్ రేస్ లోకి శ్రీలీల
ఆమె తొలి తమిళ చిత్రం "పరాశక్తి" 2026 పొంగల్ సీజన్‌లో జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా లాభదాయకమైన పండగ సీజన్‌లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.;
2024 సంక్రాంతి టైమ్ లో "గుంటూరు కారం" సినిమాతో బాక్సాఫీస్‌లో అడుగుపెట్టిన శ్రీలీల, ఇప్పుడు మరోసారి పండగ రేసులోకి రాబోతోంది. ఈసారి ఆమె తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె తొలి తమిళ చిత్రం "పరాశక్తి" 2026 పొంగల్ సీజన్‌లో జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా లాభదాయకమైన పండగ సీజన్‌లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.
డైనమిక్ హీరో శివకార్తికేయన్ హీరోగా నటిస్తుండగా, ప్రఖ్యాత దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ పీరియడ్ డ్రామాలో శ్రీలీల ఒక స్టూడెంట్ పాత్రలో కనిపించనుంది, ఇది ఆమె గత పాత్రల నుండి పూర్తిగా భిన్నమైనది. గతంలో "గుంటూరు కారం"తో సంక్రాంతి సీజన్‌లో పెద్దగా సక్సెస్ సాధించలేక పోయిన శ్రీలీల, ఈసారి తమిళ మార్కెట్‌లో, ముఖ్యంగా హై-ప్రొఫైల్ పొంగల్ సీజన్‌లో ఆమె ఏ రేంజ్ హిట్ అందుకుంటుందా అని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో పలు ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో "మాస్ జాతర" అనే యాక్షన్ ఎంటర్‌టైనర్, బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్ సరసన ఒక సినిమా, పవన్ కళ్యాణ్ నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం "ఉస్తాద్ భగత్ సింగ్" ఆమె లైనప్‌లో ఉన్నాయి.