' బ్యాడ్ యాస్ ' బాయ్ గా సిద్ధూ జొన్నలగడ్డ
సిద్ధూ జొన్నలగడ్డ తన కొత్త సినిమా కి 'బ్యాడ్ యాస్' అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారు. ఈ మూవీతో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు సిద్ధూ. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫేమ్ రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా, టిల్లు ఫ్రాంచైజీ నిర్మాతల నుంచి వస్తూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా విడుదలైన సినిమా పోస్టర్ సూపర్ బోల్డ్‌గా ఉంది.
పోస్టర్‌లోని కోట్ "మిడిల్ ఫింగర్ ఒక మనిషి అయితే" అని మెన్షన్ చేసి ఉంది. ఈ సినిమా ఇంటెన్స్ అండ్ గ్రిట్టీ వైబ్‌ను సెట్ చేస్తోంది. బిగ్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమా నుంచి అప్డేట్ 2025 జూలై 9న రానుంది. ఈ రెబెల్ థీమ్‌తో 'బ్యాడ్ యాస్' కొత్త ట్రెండ్ సెట్ చేసి, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది.సిద్ధూ, తన వైవిధ్యమైన నటనతో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నాడు, ఈ సినిమాలో మరో లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు.
నిర్మాతల ఇన్ఫో ప్రకారం, ఈ సినిమా కొత్త రూట్‌లో వెళ్తూ సందీప్ రెడ్డి వంగా స్టైల్‌కు దగ్గరగా ఉంటుందట. నిర్మాత నాగ వంశీ కొన్ని రోజుల క్రితం ఈ సినిమా గురించి ఎగ్జైట్‌మెంట్ షేర్ చేస్తూ, "అన్నీ కుదిరితే, ఆడియన్స్‌కు ఏదో యూనిక్ థీమ్ చూపిస్తాం. ఒకవేళ కుదరకపోతే, సందీప్ రెడ్డి వంగా లాంటి కాన్సెప్ట్ ట్రై చేసి చేతులు కాల్చుకున్నారని అంటారు" అని చెప్పాడు. ఈ మూవీ తో పాటు, సిద్ధూ చేతిలో ఇంకా కోహినూర్, తెలుసు కదా, లాంటి మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా లైన్‌లో ఉన్నాయి