సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘జాక్’
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే, సినిమాలో కొన్ని అడల్డ్ డైలాగులు లేదా సన్నివేశాలు ఉండొచ్చు.;
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన “జాక్ ” సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే, సినిమాలో కొన్ని అడల్డ్ డైలాగులు లేదా సన్నివేశాలు ఉండొచ్చు. కానీ మొత్తం సినిమాలోని మెజారిటీ భాగం అన్ని వయస్సుల ప్రేక్షకులకు అనుకూలంగా ఉంటుందని మేకర్స్ చెబుుతున్నారు.
ఈ సినిమా ఏప్రిల్ 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన “జాక్” ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. ట్రైలర్ ఆధారంగా సినిమా ఎలా ఉండబోతోందో, దాని జానర్ గురించి స్పష్టత వచ్చింది. ఈ చిత్రానికి ఆచు రాజమణి, సామ్ సీయస్ కలిసి సంగీతాన్ని అందించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో ప్రకాష్ రాజ్, నరేశ్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్ పూర్తి కావడంతో విడుదలకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ‘డిజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల సూపర్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న సిద్ధూ .. ఈ సినిమాతో హిట్టందుకుంటే.. హాట్రిక్ బాయ్ అవుతాడు. మరి ‘జాక్’ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.