స్టార్ హీరోలకు తల్లిగా నటిస్తాను, కానీ.. : శ్రియా శరణ్
యంగ్ స్టార్స్‌కు అమ్మ పాత్రలు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక్క కండిషన్.. ఆ రోల్స్‌లో డెప్త్, ఇంపాక్ట్ ఉండాలి...” అని చెప్పింది.;
శ్రియా శరణ్... తన కిల్లర్ ఫిజిక్‌తో ఎప్పటికీ యంగ్‌గా కనిపించే చార్మ్‌తో, నలభైల్లో ఉన్నా ముప్పైల్లోని వైబ్‌ను ఈజీగా ఇస్తుంది. అందుకే ఫ్యాషన్ క్యాంపెయిన్స్, మ్యాగజైన్ కవర్స్‌లో ఇప్పటికీ రాజ్యమేలుతోంది. అదే టైంలో, పరిపక్వత కావాల్సిన రోల్స్ నుంచి ఆమె వెనకడుగు వేయడం లేదు. “మిరాయ్”లో తేజ సజ్జాకు తల్లిగా నటించింది. ఇంతకుముందు రాజమౌళి “ఆర్‌ఆర్‌ఆర్”లో అజయ్ దేవగణ్ భార్యగా, రామ్ చరణ్‌కు అమ్మగా నటించింది. రామ్ చరణ్‌తో స్క్రీన్ టైం తక్కువైనా.. ఆ రోల్ తో కథలో తన వెయిట్‌ను చూపించింది.
“మిరాయ్” గురించి శ్రియా మాట్లాడుతూ.. “యంగ్ స్టార్స్‌కు అమ్మ పాత్రలు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక్క కండిషన్.. ఆ రోల్స్‌లో డెప్త్, ఇంపాక్ట్ ఉండాలి...” అని చెప్పింది. 2001లో తెలుగు మూవీ “ఇష్టం”తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా.. రెండు దశాబ్దాలకు పైగా జర్నీ చేసి, ఇప్పుడు మరింత డీప్, మీనింగ్‌ఫుల్ రోల్స్‌పై ఫోకస్ చేస్తోంది.
గత మూడు, నాలుగు సంవత్సరాలుగా.. శ్రియా మెచ్యూర్డ్ క్యారెక్టర్స్‌పై కాన్సన్‌ట్రేట్ చేసింది. 2022లో “ఆర్‌ఆర్‌ఆర్”లో అజయ్ దేవగణ్ భార్యగా నటించింది. 2023లో కన్నడ పీరియడ్ యాక్షన్ డ్రామా “కబ్జా”లో కనిపించింది. తమిళ మూవీ “నరగసూరన్”లో కూడా కీలక రోల్ ప్లే చేసింది. ఇప్పుడు 2025లో “మిరాయ్”లో తేజ సజ్జాకు అమ్మగా నటిస్తూ.. అలాంటి క్యారెక్టర్స్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు చెబుతోంది.