‘డ్యాన్సింగ్ క్వీన్’ ట్యాగ్ నుంచి బైట పడాలనుకుంటోంది
శ్రీలీల ఒక అద్భుతమైన డాన్సర్ అని అందరికీ తెలుసు. ఆమెకు ‘డాన్సింగ్ క్వీన్’ అనే ట్యాగ్ కూడా వచ్చింది. కానీ, ఈ ట్యాగ్ నుంచి బయటపడాలని, కంటెంట్ ఆధారిత సినిమాలపై దృష్టి పెట్టాలని ఆమె భావిస్తోంది.;
తెలుగు అందం శ్రీలీల టాలీవుడ్‌లో కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అదే సమయంలో హిందీ, తమిళ ప్రాజెక్టులపై కూడా ఫోకస్ చేస్తోంది. ఆమె తాజా తెలుగు సినిమాలు కొన్ని నిరాశపరిచాయి. దీంతో శ్రీలీలను సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశారు. ఆమె డాన్స్ మూమెంట్స్‌కు మంచి గుర్తింపు లభించినప్పటికీ, ఈ చిత్రాల్లో ఆమె పాత్రలు పాటలకే పరిమితమయ్యాయి.
శ్రీలీల ఒక అద్భుతమైన డాన్సర్ అని అందరికీ తెలుసు. ఆమెకు ‘డాన్సింగ్ క్వీన్’ అనే ట్యాగ్ కూడా వచ్చింది. కానీ, ఈ ట్యాగ్ నుంచి బయటపడాలని, కంటెంట్ ఆధారిత సినిమాలపై దృష్టి పెట్టాలని ఆమె భావిస్తోంది. శ్రీలీల ఇకపై కాన్సెప్ట్ డ్రివెన్ ఫిల్మ్స్‌లో నటించాలని ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాల్లో కూడా బ్యాలెన్స్ చేయాలని చూస్తోంది.
కార్తీక్ ఆర్యన్ కు జోడీగా ఆమె బాలీవుడ్ సినిమాతో డెబ్యూ చేస్తోంది. దీనిపై భారీ అంచనాలున్నాయి. హిందీలో ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కానీ ఈ సినిమాల ఫలితాలు ఆమె బాలీవుడ్ కెరీర్‌ను ప్రభావితం చేయనున్నాయి. ప్రస్తుతానికి శ్రీలీల తొందరపడకుండా.. తెలివైన నిర్ణయాలు తీసుకోవాలని నిశ్చయించుకుంది. స్పెషల్ సాంగ్స్‌కు దూరంగా ఉంటూ, తన కెరీర్‌పై పూర్తిగా ఫోకస్ చేయాలని డిసైడ్ చేసింది.