భయానక అనుభవాల ఊహల్లో ‘శివంగి’

Update: 2025-03-01 09:32 GMT


Full View

మహిళా ప్రధాన చిత్రంగా రాబోతుంది ‘శివంగి‘. ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్, జాన్ విజయ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి ఎ.హెచ్. కాశిఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.



ట్రైలర్ విషయానికొస్తే.. గృహిణి సత్యభామ (ఆనంది)కు ఒక మిస్టీరియస్ వ్యక్తి నుంచి ఎదురయ్యే భయానక అనుభవాలను హైలైట్ చేయడం కనిపించింది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్ ఆ సంఘటనలపై దర్యాప్తు చేసే అధికారిణిగా కనిపిస్తుంది. మొత్తంగా ఓ మిస్టరీయస్ థ్రిల్లర్ గా ‘శివంగి‘ అలరించబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది.

Tags:    

Similar News