రీరిలీజ్ కు రెడీ అయిన ‘శివ’
ఇప్పుడు ఈ ఐకానిక్ సినిమా 4K రీమాస్టర్డ్ వెర్షన్‌లో.. డాల్బీ అట్మాస్ సౌండ్‌తో మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. నాగార్జున అక్కినేని ఈ రీ-రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించారు.;
నాగార్జున అక్కినేని హీరోగా నటించిన ‘శివ’ తెలుగు సినిమా పరిశ్రమను మలుపు తిప్పిన ఒక మైల్ స్టోన్ మూవీ. ఈ సినిమా కథనం, చిత్రీకరణ శైలి, సాంకేతిక ప్రమాణాల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మాణంలో.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై 1989లో అక్టోబర్ 5న విడుదలైన ఈ కల్ట్ క్లాసిక్.. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా తొలి అడుగు వేసిన చిత్రం.
ఇప్పుడు ఈ ఐకానిక్ సినిమా 4K రీమాస్టర్డ్ వెర్షన్‌లో.. డాల్బీ అట్మాస్ సౌండ్‌తో మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. నాగార్జున అక్కినేని ఈ రీ-రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం నవంబర్ 14, 2025న గ్రాండ్ రీరిలీజ్ కాబోతోంది.
ఈ రీ-రిలీజ్ గురించి నాగార్జున మాట్లాడుతూ, “మా నాన్న ఎప్పుడూ.. సినిమా తరాలను అధిగమించి జీవించగల శక్తి కలిగి ఉందని నమ్మేవారు. ‘శివ’ అలాంటి సినిమాల్లో ఒకటి. దీన్ని నవంబర్ 14న 4K డాల్బీ అట్మాస్‌తో కొత్త రూపంలో మళ్లీ పెద్ద తెరపై తీసుకొచ్చి, కథలను శాశ్వతంగా జీవించేలా చేయాలన్న ఆయన కలను నిజం చేయడం మా ఆనందం,” అని అన్నారు.