క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ !
విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్-ప్రొడక్షన్ కోసం కొంచెం ఎక్కువ టైం తీసుకుని, సినిమా సూపర్ క్వాలిటీలో వచ్చేలా టీమ్ ప్లాన్ చేసింది.;
మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తు్న్న “సంబరాల యేటిగట్టు” మూవీ రిలీజ్.. మొదట సెప్టెంబర్ 25కి సెట్ చేసినా, ఇప్పుడు వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్-ప్రొడక్షన్ కోసం కొంచెం ఎక్కువ టైం తీసుకుని, సినిమా సూపర్ క్వాలిటీలో వచ్చేలా టీమ్ ప్లాన్ చేసింది.
మేకర్స్ ఒక స్టేట్‌మెంట్‌లో, “ఈ సినిమా ప్రేక్షకులకు టాప్ క్లాస్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని మా గట్టి నమ్మకం. అందుకే క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ చేయట్లేదు,” అని చెప్పారు. కానీ, కొత్త రిలీజ్ డేట్‌ని ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ మూవీని రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ స్టోరీ ఓ పాత టైమ్‌లో సెట్ చేశారు.
‘హనుమాన్’ సినిమాకి ప్రొడ్యూసర్‌గా వర్క్ చేసిన నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో హీరోయిన్. ఆమె రీసెంట్‌గా కెరీర్‌పై ఫోకస్ చేయడానికి సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంది. సాయి దుర్గా తేజ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఫుల్ డెడికేషన్‌తో, తన రోల్ కోసం ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా చేసుకున్నాడు.