మెగాస్టార్ కు విలన్ గా షైన్ టామ్ చాకో ?

నాని 'దసరా', ఎన్టీఆర్ 'దేవర' చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన మాలీవుడ్ వివాదాస్పద నటుడు షైన్ టామ్ చాకో ఈ సినిమాలో చిరంజీవిని ఢీ కొట్టే.. ప్రధాన విలన్‌గా నటిస్తున్నట్టు టాక్.;

By :  K R K
Update: 2025-10-04 00:24 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలోని మొదటి పాట 'మీసాల పిల్లా' ప్రోమో విడుదలైంది. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు పూర్తి పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా అందిన ఖచ్చితమైన సమాచారం ఏమిటంటే.. నాని 'దసరా', ఎన్టీఆర్ 'దేవర' చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన మాలీవుడ్ వివాదాస్పద నటుడు షైన్ టామ్ చాకో ఈ సినిమాలో చిరంజీవిని ఢీ కొట్టే.. ప్రధాన విలన్‌గా నటిస్తున్నట్టు టాక్.

ఈ మెగా చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా.... క్యాథరిన్ ట్రెసా మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. షైన్ స్క్రీన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి షైన్ టామ్ చాకో విలనిజం ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. 

Tags:    

Similar News