‘ది రాజా సాబ్’ డబ్బింగ్ స్టార్ట్!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో వస్తున్న మూవీ 'ది రాజా సాబ్'. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.;
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో వస్తున్న మూవీ 'ది రాజా సాబ్'. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. లేటెస్ట్ గా మూవీ టీమ్ డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించింది. డబ్బింగ్ ప్రోగ్రెస్ కి సంబంధించి రెండు ఫోటోలను షేర్ చేసింది.
జనవరి 9న సంక్రాంతి కానుకగా రానున్న 'రాజా సాబ్' కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' తర్వాత వరుసగా సీరియస్ పాత్రల్లో కనిపించిన ప్రభాస్, ఈ సారి ఎంటర్టైన్మెంట్ రోల్‌లో అలరించబోతున్నాడు. ‘బుజ్జిగాడు’లో కనిపించిన అతని కామెడీ టైమింగ్‌ను మళ్లీ చూడబోతున్నామన్న ఉత్సాహం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. హారర్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ లో విఎఫ్ఎక్స్, కామెడీ ఎలిమెంట్స్ కు మంచి మార్కులు పడ్డాయి. వచ్చే సంక్రాంతి బరిలో సూపర్ ఎంటర్‌టైనర్‌గా 'ది రాజా సాబ్' నిలుస్తుందనే కాన్ఫిడెన్స్ ఇటు మేకర్స్, అటు రెబెల్ ఫ్యాన్స్ ఇద్దరిలోనూ ఉంది.