హీరోగా శర్వానంద్ స్థానంలో గోపీచంద్ ?
దర్శకుడు సంపత్ నంది అదే కథతో గోపీచంద్‌ను సంప్రదించారట. చర్చలు కూడా నడుస్తున్నాయట. గోపీచంద్ కూడా గత దశాబ్దంలో చాలా ఫ్లాప్‌లు చూశాడు.. కాబట్టి, ఈ కాంబినేషన్ ఇద్దరికీ చాలా రిస్క్‌తో కూడుకున్న అంశమే.;
సినిమా కెరీర్లు అంటేనే సర్‌ప్రైజ్‌లు, అనుకోని మలుపులు. 'రన్ రాజా రన్' హీరో శర్వానంద్‌కు గడిచిన పదేళ్లలో ఇలాంటి మలుపులు ఎన్నో ఎదురయ్యాయి. నటనతో పాటు, ఆయన 'ఓమి' పేరుతో ఫిల్మ్ ప్రొడక్షన్, హాస్పిటాలిటీ, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టారు. అయినా సరే, సినిమాల్లో సక్సెస్ మాత్రం ఆయనకు అందకుండా పోయింది. అయితే, తన పుట్టినరోజు సందర్భంగా, గతం ఎలా ఉన్నా ముందుకు వెళ్తానని చెప్తూ.. తాను చేస్తున్న మూడు ప్రాజెక్ట్‌లను ప్రకటించారు.
శర్వానంద్ రాబోయే సినిమాల్లో . ఒకటి.. మాస్ ఎంటర్‌టైనర్ ‘భోగి’. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తర్వాత.. గత మూడు నెలలుగా కొన్ని అంతుచిక్కని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం, దర్శకుడు సంపత్ నంది అదే కథతో గోపీచంద్‌ను సంప్రదించారట. చర్చలు కూడా నడుస్తున్నాయట. గోపీచంద్ కూడా గత దశాబ్దంలో చాలా ఫ్లాప్‌లు చూశాడు.. కాబట్టి, ఈ కాంబినేషన్ ఇద్దరికీ చాలా రిస్క్‌తో కూడుకున్న అంశమే.
కేకే రాధా మోహన్ 'భోగి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్‌లో 'గౌతమ్ నంద' , 'సీటీమార్' చిత్రాల తర్వాత ఇది మూడో సినిమా అవుతుంది. ఈ లోపు, శర్వానంద్... రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందు తున్న 'నారీ నారీ నడుమ మురారి'.. ఇంకా అభిలాష్ డైరెక్షన్‌లో వస్తున్న పేరు పెట్టని స్పోర్ట్స్ డ్రామా పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.
శర్వానంద్ తన మిగిలిన సినిమాలపై ఫోకస్ చేస్తుండగా.. గోపీచంద్ ఈ ప్రాజెక్ట్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండడంతో ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మార్పు 'భోగి'కి అవసరమైన బూస్ట్ ఇస్తుందా, లేదా ఇది మరో మిస్డ్ ఆపర్చునిటీ అవుతుందా? అనేది చూడాలి.