రిలీజ్‌కు ముందే సెన్సేషన్!

Update: 2025-03-21 12:11 GMT

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎల్‌2: ఎంపురాన్' సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం ప్రీ-బుకింగ్‌లో అద్భుతమైన స్పందన రాబడుతుంది.


ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో లో మొదటి గంటలోనే 96,140 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ ఫీట్‌తో, ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక హవర్లీ ప్రీ-సేల్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. గతంలో ఈ రికార్డు 'లియో, పుష్ప 2' వంటి భారీ చిత్రాల పేరిట ఉండగా ఇప్పుడు 'ఎంపురాన్' వాటిని అధిగమించింది.

మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా, ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తుంది. థియేటర్లలో ఫస్ట్-డే, ఫస్ట్-షో టిక్కెట్లు వేగంగా హౌస్‌ఫుల్ అవుతుండగా, మరిన్ని రికార్డులు ఈ సినిమా పేరిట నమోదు కావొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News