‘కన్నప్ప‘ నుంచి సెకండ్ టీజర్ వచ్చేసింది!

Update: 2025-03-01 09:07 GMT

ఈ వేసవి కానుకగా విడుదలకు ముస్తాబవుతోన్న చిత్రాలలో ‘కన్నప్ప‘ ఒకటి. శివ భక్తుడు కన్నప్ప కథతో మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మక చేస్తున్న సినిమా ఇది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ బాబు వంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రచారంలో స్పీడు పెంచింది టీమ్.



Full View


ఇప్పటికే ‘కన్నప్ప‘ నుంచి ఒక టీజర్, పాట విడుదల కాగా.. లేటెస్ట్ గా సెకండ్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో తిన్నడుగా కన్నప్ప చేసే యుద్ధాలను హైలైట్ చేశారు. అలాగే ఫస్ట్ టీజర్ లో కేవలం ముఖాలు మాత్రమే చూపించిన ప్రభాస్, అక్షయ్, మోహన్ లాల్ వంటి నటులను ఇందులో కొన్ని సెకన్ల పాటు చూపించారు. మొత్తంగా.. భారీ విజువల్ ఫీస్ట్ అందించేందుకు ‘కన్నప్ప‘ సిద్ధమవుతున్నట్టు ఈ టీజర్ ను బట్టి తెలుస్తోంది.

Tags:    

Similar News