శర్వా 38 కోసం స్పెషల్ మేకోవర్ !
ఈ చిత్రంలో శర్వానంద్ లుక్‌ను బాలీవుడ్ స్టైలిస్టులు ఆలిమ్ హకీమ్, పట్టణం రషీద్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు.;
యంగ్ హీరో శర్వానంద్ తన కొత్త పాన్ ఇండియా చిత్రం ‘శర్వా 38’ కోసం విప్లవాత్మకమైన మార్పుకు సిద్ధమవుతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా.. నటుడికే కాదు, దర్శకుడికి కూడా ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.
1960ల చివరలో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ సినిమా, రక్తసిక్తమైన భయంకర ప్రపంచంలో జీవన సమరాన్ని ప్రతిబింబించనుంది. ఈ చిత్రంలో శర్వానంద్ లుక్‌ను బాలీవుడ్ స్టైలిస్టులు ఆలిమ్ హకీమ్, పట్టణం రషీద్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు.
సౌందర్ రాజన్.ఎస్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. ఏప్రిల్ నెల నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈ సినిమా శర్వానంద్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.