టాలీవుడ్లో సమంత రీఎంట్రీ షురూ !
అందాల సమంత టాలీవుడ్‌లో మళ్లీ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రెండేళ్ల విరామం తర్వాత.. ఆమె కొత్త సినిమాలకు సంతకం చేస్తున్నట్టు టాక్. ఈ గ్యాప్‌లో ఆమె ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించడంతో పాటు.. ‘రక్త బ్రహ్మాండ్’ అనే మరో వెబ్ ప్రాజెక్ట్‌కి అంగీకరించింది. అయితే.. ఎక్కువ సమయం ఆమె మానసిక ప్రశాంతత కోసం విహరిస్తూ.. తన ఆరోగ్య సమస్యలకి చికిత్స తీసుకుంటూ గడిపింది.
ఇప్పుడు ప్రశాంతతలో ఉన్న సమంత.. దర్శకుడు రాజ్ నిడమోరుతో సన్నిహిత సంబంధం కలిగి ఉందని వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత జీవితంలో స్థిరపడిన ఆమె... తిరిగి తన సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టడానికి సిద్ధమయింది. ఈ కొత్త దశలో సమంత మొదటగా నటించబోయే సినిమా.. ఆమెకు ఎంతో ఆప్తురాలైన నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనుంది.
ప్రస్తుతం నందినీ రెడ్డి సమంత కోసం ప్రత్యేకంగా ఓ కథ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి చేసిన ‘జబర్దస్త్’ మూవీ అంతగా క్లిక్ అవ్వనప్పటికీ.. ఆ తర్వాత "ఓ బేబీ" మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతేకాక, సమంత మళ్లీ అగ్రహీరోల సరసన నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే ఆమె కొత్త తెలుగు సినిమాల గురించి మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.