రెండు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్
2026 కోసం రవితేజ ఇప్పటికే రెండు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రవితేజ అభిమానులు రాబోయే ఏళ్లలో యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిన మాస్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూడొచ్చు.;
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజా చిత్రం ‘మాస్ జాతర’ విడుదలలో కొన్ని ఆటంకాలు ఎదురై, ఆగస్టులో రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనుంది. మరో వైపు, రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
2026 కోసం రవితేజ ఇప్పటికే రెండు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజా సమాచారం ప్రకారం.. దర్శకుడు శివ నిర్వాణతో ఓ చిత్రం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాడు. ‘ఖుషి’ సినిమా విఫలమైన తర్వాత సరైన హీరో కోసం వెతుకుతున్న శివ నిర్వాణ.. తన కొత్త కాన్సెప్ట్‌తో రవితేజను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది, షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుంది.
అలాగే, యువ దర్శకుడు సందీప్ రాజ్‌తో కూడా రవితేజ ఓ ఆసక్తికర ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపాడు. దాదాపు ఏడాదిగా చర్చల్లో ఉన్న ఈ సినిమా షూటింగ్ 2026 మధ్యలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఈ రెండు చిత్రాలూ భారీ అంచనాలతో రూపొందుతున్నాయి. రవితేజ అభిమానులు రాబోయే ఏళ్లలో యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిన మాస్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూడొచ్చు!