మెగాస్టార్ ను ఢీకొట్టబోతున్న రవితేజ, నవీన్ పోలిశెట్టి
సంక్రాంతి 2026లో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నవీన్ పొలిశెట్టి సినిమాల మధ్య బాక్సాఫీస్ బిగ్ ఫైట్ ఖాయం.;
టాలీవుడ్ కు చాలా కీలకమైన సీజన్ సంక్రాంతి. ఈ పండుగ సమయంలో ప్రతి స్టార్ తమ సినిమా రిలీజ్ కోసం స్లాట్ కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. సంక్రాంతి 2026 కోసం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన స్థానం బుక్ చేసుకున్నారు. ఆయన 157వ సినిమా, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న యాక్షన్ కామెడీ మూవీ చాలా రోజుల క్రితమే సంక్రాంతి రిలీజ్‌గా అఫీషియల్‌గా అనౌన్స్ అయింది.
సాధారణంగా ఈ సీజన్‌లో రెండు నుంచి నాలుగు బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీకొంటాయి. ఇప్పుడు ఇంకో రెండు సినిమాలు కూడా ఈ రేసులో చేరాయి. నవీన్ పొలిశెట్టి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “అనగనగ ఒక రాజు”, మీనాక్షి చౌదరితో కలిసి, సంక్రాంతి 2026 రిలీజ్‌కి లాక్ అయింది. ఈ విషయాన్ని మేకర్స్ రీసెంట్‌గా కన్ఫర్మ్ చేశారు.
ఇక రవితేజ కూడా ఈ రేసులోకి ఎంటర్ అయ్యారు. ఆయన 76వ సినిమా, టెంపరరీగా ఆర్టీ76 అని పిలుస్తున్న ప్రాజెక్ట్.. తాజాగా లాంచ్ అయింది. ఈ సినిమాని కూడా సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కాబట్టి, సంక్రాంతి 2026లో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నవీన్ పొలిశెట్టి సినిమాల మధ్య బాక్సాఫీస్ బిగ్ ఫైట్ ఖాయం. ఇంకా వేరే సినిమాలు ఈ రేసులో చేరతాయా లేదా అనేది చూడాలి.