‘ఓజీ’ బీజీఎంలో జపాన్ టచ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తున్నారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ మూవీకి సంగీతం అందిస్తున్న తమన్ ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం జపాన్‌కు చెందిన అరుదైన వాయిద్య పరికరం కోటోను ఉపయోగించి స్వరాలు సమకూర్చినట్లు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకోసం మ్యూజిక్ పరంగా తమన్ ఎంతో వైవిధ్యాన్ని చూపించబోతున్నాడు. ‘ఓజీ’ సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.