‘స్పిరిట్’పై అదిరిపోయే అప్‌డేట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా మీద అభిమానుల్లో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా మీద అభిమానుల్లో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇంకా షూటింగ్ మొదలవకముందే ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా ఆసక్తికరమైన అప్‌డేట్ షేర్ చేశాడు. ''స్పిరిట్'కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో 70% ఇప్పటికే పూర్తి చేశాం. ‘యానిమల్’ టైమ్‌లో కూడా ఇలాగే ముందే మ్యూజిక్ వర్క్ పూర్తి చేయడం వల్ల సీన్ల అవుట్‌పుట్ క్లారిటీగా వచ్చింది. ఇది టైమ్, ఖర్చు రెండింటినీ తగ్గిస్తుంది' అని తెలిపాడు.
ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ – 'డార్లింగ్‌లో స్టార్ హీరో గర్వం అస్సలు కనిపించదు. ఊహించిన దానికంటే ఎక్కువగా ఈ సినిమాకు సహకరిస్తున్నారు. ఈ మూవీలో ఆయన రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒకటి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్, మరొకటి ఫ్లాష్‌బ్యాక్‌లో మాఫియా డాన్' అని చెప్పి ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచాడు.
త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ని భద్రకాళీ పిక్చర్స్ – టీ సిరీస్ నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ‘ది రాజా సాబ్, ఫౌజీ' ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్, త్వరలో ‘స్పిరిట్’ లోకి అడుగుపెట్టనున్నాడు. మొత్తంగా, పోలీస్ గెటప్‌లో తొలిసారి కనిపించబోతున్న ప్రభాస్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.