రవితేజ నెక్స్ట్ మూవీకి టైటిల్ ఇదేనా?

తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త సినిమాకు “అనార్కలి” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ ఇంకా ఖరారు కానప్పటికీ, సినిమా కథాంశానికి సరిగ్గా సరిపోయేలా ఈ పేరు ఎంచుకున్నట్లు తెలుస్తోంది.;

By :  K R K
Update: 2025-05-31 01:08 GMT

మాస్ మహారాజా రవి తేజ... ప్రస్తుతం “మాస్ జాతర” చిత్రం షూటింగ్‌ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ చిత్రీకరణ దాదాపు పూర్తికావస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 2025లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. “మాస్ జాతర” రవి తేజ అభిమానులకు మరో హై-ఎనర్జీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని, ఇందులో అతని సిగ్నేచర్ మాస్ యాక్షన్ మరియు డైలాగ్ డెలివరీ అభిమానులను అలరించనున్నాయని సమాచారం.

“మాస్ జాతర” షూటింగ్ దాదాపు ముగియడంతో.. రవి తేజ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ కొత్త సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో “నేను శైలజ, చిత్రలహరి” వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించాడు. ఈ కొత్త చిత్రం పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని, ఇందులో కామెడీ డ్రామా, రవి తేజ స్టైల్‌ యాక్షన్ సీన్స్ సమపాళ్లలో ఉంటాయని టాక్. ఈ సినిమా అధికారికంగా జూన్ లో లాంచ్ కానుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త సినిమాకు “అనార్కలి” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ ఇంకా ఖరారు కానప్పటికీ, సినిమా కథాంశానికి సరిగ్గా సరిపోయేలా ఈ పేరు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవి తేజకు జోడీగా యువ నటి కేతిక శర్మ నటించనుందని సమాచారం.

Tags:    

Similar News