రాశీఖన్నా ఆశలన్నీ ఆ సినిమాలపైనే !
ఈ సినిమా రిలీజ్ కోసం ఆమె సూపర్ ఎక్సైటెడ్‌గా ఉంది, ఎందుకంటే ఇది ఆమెకు మరో బిగ్ బ్రేక్ ఇవ్వగల సినిమాగా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలను తన కెరీర్‌లో కొత్త టర్నింగ్ పాయింట్‌గా చూస్తోంది రాశీ.;
ఒకప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా వెలిగిపోయింది అందాల రాశీఖన్నా. ఇటీవల కెరీర్‌లో కాస్త డల్ ఫేజ్‌ను ఎదుర్కొంది. సినిమా అవకాశాలు కాస్త తగ్గాయి. అయితే ఇప్పుడు సీన్ మారుతోంది. ఆమె కెరీర్‌లో కొత్త ఊపు రాబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే... రాశీ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్... ఆమెకు బాగా కలిసొచ్చింది.
ఈ సౌలభ్యం వల్లే ఆమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాలో ఛాన్స్ దక్కింది. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా, రాష్ట్ర పరిపాలనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి, ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ చాలా అనిశ్చితంగా ఉంది. ఆయనకు ఖాళీ దొరికినప్పుడల్లా షూటింగ్ జరుగుతుంది. ఇలాంటి సిచుయేషన్‌లో రాశీ ఖాళీ డేట్స్ ఆమెకు భారీ అడ్వాంటేజ్‌గా మారాయి. దీనివల్ల ఆమె ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో భాగమైంది.
"ఉస్తాద్ భగత్ సింగ్"లో రాశీ శ్లోక అనే క్యారెక్టర్‌లో కనిపించనుంది. ఈ పాత్ర ఆమెకు కొత్త ఇమేజ్‌ను తెచ్చిపెడుతుందని ఆమె భావిస్తోంది. ఈ సినిమా ఆమె టాలెంట్‌ను మరోసారి హైలైట్ చేసే అవకాశంగా భావిస్తోంది. ఇది కాకుండా, రాశీ మరో ఎక్సైటింగ్ ప్రాజెక్ట్‌లోనూ బిజీగా ఉంది. సిద్ధు జొన్నలగడ్డతో కలిసి "తెలుసు కాదా" అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె తన షూటింగ్ దాదాపు పూర్తి చేసేసింది.
ఈ సినిమా రిలీజ్ కోసం ఆమె సూపర్ ఎక్సైటెడ్‌గా ఉంది, ఎందుకంటే ఇది ఆమెకు మరో బిగ్ బ్రేక్ ఇవ్వగల సినిమాగా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలను తన కెరీర్‌లో కొత్త టర్నింగ్ పాయింట్‌గా చూస్తోంది రాశీ. ఈ ప్రాజెక్ట్‌లకు ఆమెను తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్లీ టాప్ గేర్‌లోకి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నాయని ఆమె ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది.