‘రంగస్థలం’ చిత్రానికి సీక్వెల్?
ప్రస్తుతం "రంగస్థలం 2" స్క్రిప్ట్‌పై ప్రాథమిక దశలో పని చేస్తున్నాడు. త్వరలో రామ్ చరణ్‌కు స్క్రిప్ట్ నరేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.;
"పుష్ప 2: ది రూల్" భారీ విజయం తర్వాత కాస్త విరామం తీసుకుంటున్నాడు దర్శకుడు సుకుమార్. నాన్-స్టాప్ వర్క్ తర్వాత.. ఇప్పుడు తన తదుపరి సినిమా స్క్రిప్ట్‌పై ఫోకస్ చేస్తున్నాడు. రామ్ చరణ్‌తో కలిసి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్‌ను చేయాలని సుకుమార్ నిశ్చయించాడు. అయితే, రామ్ చరణ్ ఇంకా స్క్రిప్ట్ లేదా కాన్సెప్ట్ గురించి వినలేదు. సంవత్సరాల తరబడి రెస్ట్ లేకుండా పని చేసిన సుకుమార్, కొంత సమయం కుటుంబంతో గడుపుతూ, కొత్త స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ ఇద్దరి కాంబోలో గతంలో సూపర్ హిట్ అయిన "రంగస్థలం" సీక్వెల్‌ను రూపొందించాలని నిర్ణయించాడు. ప్రస్తుతం "రంగస్థలం 2" స్క్రిప్ట్‌పై ప్రాథమిక దశలో పని చేస్తున్నాడు. త్వరలో రామ్ చరణ్‌కు స్క్రిప్ట్ నరేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. "రంగస్థలం" సినిమా బ్లాక్‌బస్టర్ హిట్, రామ్ చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ విజయం సుకుమార్‌ను సీక్వెల్ చేయడానికి ప్రోత్సహించింది. అభిమానులు దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉంది. సుకుమార్ స్క్రిప్ట్‌ను పర్ఫెక్ట్ చేయడానికి సమయం తీసుకుంటున్నాడు.
సుక్కు తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్‌ను పూర్తి చేయడానికి దుబాయ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది దసరా తర్వాత స్క్రిప్ట్ నరేషన్ జరగనుంది. "రంగస్థలం" సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ సీక్వెల్ మొదటి సినిమా లెగసీకి తగ్గట్టుగా ఉంటుందని ఆశిస్తున్నారు. సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో ఈ సినిమా మరో పెద్ద ప్రాజెక్ట్ కానుంది. "రంగస్థలం" ప్రపంచాన్ని ప్రేక్షకులు ఎలా రీవిజిట్ చేస్తారనేది చూడ్డం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.