చిరంజీవి దగ్గరకు ఇండస్ట్రీ సమస్య

టాలీవుడ్‌లో గత 13 రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ఇప్పుడు కీలక మలుపు తిరగబోతోంది. నిర్మాతలు – ఫెడరేషన్ మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం చూపించే ప్రయత్నంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు.;

By :  S D R
Update: 2025-08-17 02:47 GMT

టాలీవుడ్‌లో గత 13 రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ఇప్పుడు కీలక మలుపు తిరగబోతోంది. నిర్మాతలు – ఫెడరేషన్ మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం చూపించే ప్రయత్నంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు.

ఈరోజు చిరంజీవి తన నివాసంలో నిర్మాతలు, సినీ కార్మిక సంఘం నాయకులను విడివిడిగా కలవనున్నారు. ఇరు వర్గాలతో సమగ్రమైన చర్చలు జరిపి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా మెగాస్టార్ కృషి చేయబోతున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో నిర్మాతలు, కార్మికుల మధ్య అమలవుతున్న ఒప్పందాలపై సమాచారం సేకరించిన చిరు, ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.

ఇప్పటికే నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి మధ్యవర్తిత్వం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ముందస్తు ప్రిపరేషన్‌లో భాగంగా ఆయన నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధుల నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తున్నారని టాక్.

చిరంజీవి ఈ సమస్యను సయోధ్యతో పరిష్కరిస్తే, షూటింగుల నిలిపివేత వల్ల వస్తున్న కోట్ల నష్టం తగ్గిపోతుంది. ఇప్పటికే లక్షల నష్టం ఇండస్ట్రీపై పడగా, ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ వివాద పరిష్కారం కోసం అందరి చూపు ఇప్పుడు మెగాస్టార్ వైపు తిరిగింది.

Tags:    

Similar News