రామ్ చరణ్ సరికొత్త స్ట్రాటజీ !

ఈ సినిమాను ఎలాంటి డిలే లేకుండా, షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయాలన్నది అతడి ప్రధాన టార్గెట్. ఈ ఏడాది డిసెంబర్‌లోపు షూటింగ్ మొత్తం ముగించేసి, 2026 మార్చిలో గ్రాండ్ రిలీజ్‌కు సెట్ చేయాలని రామ్ చరణ్ ప్లాన్.;

By :  K R K
Update: 2025-06-17 12:50 GMT

“పెద్ది” సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. సెట్స్ లో ఎనర్జీ మొత్తం పెట్టి పని చేస్తున్నాడు. ఈ సినిమాను ఎలాంటి డిలే లేకుండా, షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయాలన్నది అతడి ప్రధాన టార్గెట్. ఈ ఏడాది డిసెంబర్‌లోపు షూటింగ్ మొత్తం ముగించేసి, 2026 మార్చిలో గ్రాండ్ రిలీజ్‌కు సెట్ చేయాలని రామ్ చరణ్ ప్లాన్. గతంలో లాగా ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి టైమ్ స్పెండ్ చేయడం కాకుండా.. ఇప్పుడు అతడు వేరే స్ట్రాటజీతో వెళుతున్నాడు.

ప్రతి ప్రాజెక్ట్‌నూ నిర్ణీత టైమ్‌లైన్‌లో ఫినిష్ చేసి, వెంటనే నెక్స్ట్ మూవీకి షిఫ్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు చెర్రీ . అందుకే, “పెద్ది” థియేటర్స్‌లోకి రాకముందే తన నెక్స్ట్ ఫిల్మ్ పనులను స్టార్ట్ చేయాలని రామ్ చరణ్ ఫిక్స్ అయ్యాడు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో స్పెషల్‌గా డిజైన్ చేసిన ఓ గ్రామీణ సెట్‌లో జరుగుతోంది. ఈ సెట్‌ను కథ ఆధారంగా ఉత్తరాంధ్ర రీజియన్ వైబ్‌ను పర్ఫెక్ట్‌గా రీక్రియేట్ చేసేలా తీర్చిదిద్దారు. సెట్ లుక్ చూస్తేనే ఆ ఏరియా ఫీల్ ఫుల్‌గా కనిపిస్తుంది.

“పెద్ది” ఒక స్పోర్ట్స్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ ఓ గ్రామీణ స్పోర్ట్స్‌మేన్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్‌లో అతడి లుక్, ఎనర్జీ గురించి ఇప్పటికే ఫ్యాన్స్ మధ్య బజ్ షురూ అయ్యింది. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీకిది మరో హైలైట్. మొత్తంగా, “పెద్ది” రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఓ విజువల్ ట్రీట్‌గా, ఎమోషనల్ రైడ్‌గా ఉండబోతుందని ఇప్పటి నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. 

Tags:    

Similar News