శివ నిర్వాణ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ ?

‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ.. రామ్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.;

By :  K R K
Update: 2025-06-06 01:25 GMT

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని తన సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రూపొందుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయినప్పటికీ.. రామ్‌ తదుపరి చిత్రం గురించి ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. అయితే ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫో వినిపిస్తోంది.

‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ.. రామ్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ గతంలో భావోద్వేగాలు, ప్రేమకథలు, కుటుంబ సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించడంలో తన ప్రతిభను చాటుకున్నారు. రామ్‌ వంటి యువ నటుడితో ఆయన రూపొందించే కథ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆసక్తి ఇప్పటినుంచే అభిమానుల్లో నెలకొంది.

రామ్‌ సినిమా కెరీర్‌లో ఈ కొత్త ప్రాజెక్ట్‌ ఒక కీలకమైన మలుపు కానుంది. శివ నిర్వాణ లాంటి దర్శకుడితో జతకట్టడం, మైత్రీ మూవీ మేకర్స్‌ వంటి బలమైన నిర్మాణ సంస్థ మద్దతు ఉండటం ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచుతోంది. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ విడుదల తర్వాత రామ్‌ అభిమానులకు ఈ కొత్త సినిమా మరో సర్‌ప్రైజ్‌గా నిలవనుంది.

Tags:    

Similar News