డబ్ టెస్ట్ చేసిన ‘డెకాయిట్’ !

లీడ్ యాక్టర్ అడివి శేష్ సినిమా కోసం డబ్బింగ్ టెస్ట్ చేశాడు. ఫలితాలతో అతడు సంతోషంగా ఉన్నాడు. ఈ టెస్ట్‌తో తన పిచ్, కొత్త యాసను పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకున్నాడు.;

By :  K R K
Update: 2025-06-06 12:43 GMT

యంగ్ హీరో అడివి శేష్ తన థ్రిల్లర్ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో గట్టి ముద్ర వేశాడు. అతడి సినిమాలపై ప్రేక్షకులకు భారీ అంచనాలుంటాయి. ముఖ్యంగా అతని రాబోయే రొమాంటిక్ థ్రిల్లర్ ‘డకాయిట్’ పై అయితే ఇంక చెప్పనక్కర్లేదు. అనౌన్స్ మెంట్ పోస్టర్, వీడియో నుంచి రిలీజ్ డేట్ గ్లింప్స్ వరకు, సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ భారీ హైప్‌ను, ఆసక్తిని రేపింది.

ఇప్పుడు లీడ్ యాక్టర్ అడివి శేష్ సినిమా కోసం డబ్బింగ్ టెస్ట్ చేశాడు. ఫలితాలతో అతడు సంతోషంగా ఉన్నాడు. ఈ టెస్ట్‌తో తన పిచ్, కొత్త యాసను పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకున్నాడు. సినిమా టీమ్ ప్రకారం... జూన్ 8 నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది, షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. షనీల్ డియో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా, సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా, ఆసియన్ సునీల్ నారంగ్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఎక్సైటింగ్ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.

Tags:    

Similar News