రాజమౌళి వీడియో గేమ్ డెబ్యూ !
రాజమౌళి, కార్తికేయ ఇద్దరూ కోజిమా రాబోయే మెగా గేమ్ “డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్” లో కామియో అప్పీరియన్స్ ఇచ్చారు.;
దర్శకధీరుడు రాజమౌళి భారీ విజన్‌తో గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించిన మాస్టర్ స్టోరీటెలర్. వీడియో గేమ్స్‌కి కూడా ఆయన బిగ్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. ఈ లెజెండరీ ఫిల్మ్‌మేకర్ పలువురు టాప్ గేమ్ క్రియేటర్స్‌ని ఫాలో అవుతుంటాడు అందులో జపాన్‌కి చెందిన ఐకానిక్ గేమ్ డిజైనర్ హిడియో కోజిమా స్పెషల్ ప్లేస్‌లో ఉన్నాడు. రాజమౌళి, ఆయన కొడుకు కార్తికేయతో కలిసి కోజిమాతో ఒక యూనిక్ బాండ్‌ని షేర్ చేయబోతున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పుడు ఈ బాండ్ మరో అడుగు ముందుకు వెళ్లింది. రాజమౌళి, కార్తికేయ ఇద్దరూ కోజిమా రాబోయే మెగా గేమ్ “డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్” లో కామియో అప్పీరియన్స్ ఇచ్చారు. వీళ్ల కామియో సీన్స్‌కి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. నెటిజన్స్‌లో భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ కామియోల గురించి అధికారికంగా ఎటువంటి క్లారిటీ లేకపోయినా.. ఈ మూవ్ వెనక రాజమౌళి తన గ్లోబల్ బ్రాండ్‌ని, డిజిటల్ ప్రెజెన్స్‌ని మరింత బూస్ట్ చేయాలనే స్మార్ట్ స్ట్రాటజీ ఉందని తెలుస్తోంది.
“బాహుబలి”, “ఆర్‌ఆర్‌ఆర్” సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటారు రాజమౌళి. ముఖ్యంగా జపాన్‌లో ఈ సినిమాలు కల్ట్ ఫాలోయింగ్ సంపాదించాయి. అక్కడ రాజమౌళికి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో, కోజిమా గేమ్‌లో కామియో చేయడం అనేది కేవలం ఫన్ కోసం కాదని.. గ్లోబల్ పాప్ కల్చర్ ఆడియన్స్‌తో డీపర్ కనెక్షన్ బిల్డ్ చేయడానికి ఒక కూల్ స్టెప్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ కామియోలు రాజమౌళి బ్రాండ్‌ని డిజిటల్ స్పేస్‌లో మరింత స్ట్రాంగ్ చేసేందుకు, అతని గ్లోబల్ రీచ్‌ని ఎక్స్‌పాండ్ చేసేందుకు ఒక గేమ్‌ఛేంజర్ మూవ్‌గా చూస్తున్నారు.