బాలీవుడ్ లో ‘మిరాయ్‘ క్రేజ్

తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న పాన్-ఇండియా ఫాంటసీ–అడ్వెంచర్ డ్రామా ‘మిరాయ్’. ప్రాచీన పురాణాలతో మోడర్న్ యుగానికి లింక్ పెడుతూ ఈ చిత్రం తెరకెక్కుతుంది.;

By :  S D R
Update: 2025-08-14 10:57 GMT

తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న పాన్-ఇండియా ఫాంటసీ–అడ్వెంచర్ డ్రామా ‘మిరాయ్’. ప్రాచీన పురాణాలతో మోడర్న్ యుగానికి లింక్ పెడుతూ ఈ చిత్రం తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 5న ఈ చిత్రం 2D, 3D ఫార్మాట్స్‌లో ఎనిమిది భారతీయ, అంతర్జాతీయ భాషల్లో విడుదల కానుంది. ‘హనుమాన్’ తర్వాత తేజ మళ్లీ ‘సూపర్ యోధ’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

హిందీ బెల్ట్ డిస్ట్రిబ్యూషన్ కోసం కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చేతులు కలిపింది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్‌ ‘బ్లాక్ స్వోర్డ్’ క్యారెక్టర్ లో విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రియ, జయరామ్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘హనుమాన్‘ సినిమాకి సంగీతాన్నందించిన గౌర హరి సంగీతం టెక్నికల్ గా ఈ మూవీకి మరో ప్లస్. ఇప్పటికే ‘మిరాయ్‘ ఓటీటీ రైట్స్ కు క్రేజీ ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరిగింది.



Tags:    

Similar News