'దంగల్' రికార్డుపై పుష్పరాజ్ కన్ను!

Update: 2025-01-20 03:37 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కలయికలో వచ్చిన 'పుష్ప 2' భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డుల అధ్యాయాన్ని సృష్టిస్తుంది.విడుదలైన 40 రోజులకు కూడా తగ్గేదేలే అంటూ కలెక్షన్లను కొల్లగొడుతుంది. ప్రస్తుతం రూ.1900 కోట్ల వసూళ్లకు చేరువలో ఉన్న ఈ సినిమా లాంగ్ రన్ లో రూ.2000 కోట్లు సాధించడమే టార్గెట్ గా పెట్టుకుంది.

'పుష్ప 2' ఇప్పటికే 'బాహుబలి 2' వసూళ్లను అధిగమించి భారతీయ సినిమాల్లో కలెక్షన్ల పరంగా అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఇండియన్ మూవీస్ లో హైయ్యస్ట్ కలెక్షన్స్ రికార్డు కలిగి ఉన్న 'దంగల్' (రూ.2024) రికార్డుపై కన్నేసింది. లేటెస్ట్ గా రిలీజైన రీలోడెడ్ వెర్షన్ తో 'దంగల్' వసూళ్లను అధిగమించి 'పుష్ప 2' అగ్ర స్థానాన్ని ఆక్రమిస్తుందనే అంచనాలున్నాయి.

లేటెస్ట్ గా 20 నిమిషాల కొత్త ఫుటేజ్ తో రీలోడెడ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త వెర్షన్ లో 8 కొత్త సన్నివేశాలను జతచేశారు. పుష్పరాజ్-షెకావత్-మంగళం శ్రీను ముగ్గురి సంభాషణలు, సిండికేట్‌ మీటింగ్ కి సంబంధించిన సంభాషణలు, జాతరలో శ్రీవల్లి-కావేరి మధ్య సీన్స్, శ్రీలంక, జపాన్ ఎపిసోడ్స్, జాలిరెడ్డి సీన్, క్లైమాక్స్‌లో పుష్పరాజ్ కి చైన్ తిరిగి ఇచ్చే సన్నివేశాలు కలిపారు.

ఈ కొత్త సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఉన్న చిన్న చిన్న సందేహాలకు క్లారిటీ ఇచ్చాయనే చెప్పాలి. రీలోడెడ్ వెర్షన్ విజయవంతంగా సాగుతుండటంతో, 'పుష్ప-2: ది రూల్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సెట్ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది.

Tags:    

Similar News