టైటిల్ అండ్ టీజర్ లాంచ్ వాయిదా !
విజయ్ రోడ్‌షోలో కరూర్ విషాదం చోటుచేసుకున్న సంఘటనలో పిల్లలతో సహా 39 మంది మరణించడంతో.. ఈ ఈవెంట్ ను చిత్రబృందం రద్దు చేస్తు్న్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.;
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా.. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న తన లేటెస్ట్ మూవీ టైటిల్ అండ్ టీజర్‌ను ఆవిష్కరించాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు. అయితే, విజయ్ రోడ్‌షోలో కరూర్ విషాదం చోటుచేసుకున్న సంఘటనలో పిల్లలతో సహా 39 మంది మరణించడంతో.. ఈ ఈవెంట్ ను చిత్రబృందం రద్దు చేస్తు్న్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.
‘తమిళనాడులో జరిగిన దురదృష్టకర సంఘటన కారణంగా.. ఈరోజు ప్లాన్ చేసిన టైటిల్ అండ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నాం. మృతుల కుటుంబాలకు చిత్రబృందం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. ఈ విషాద సమయంలో వారికి అండగా నిలుస్తుంది.. అని పేర్కొన్నారు.
ఈ చిత్రానికి "స్లమ్‌డాగ్" అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి, అయితే అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాలి. ఇందులో విజయ్ సేతుపతి ప్రధాన కథానాయకుడిగా నటిస్తుండగా.. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. వెటరన్ బ్యూటీ టబు కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ చిత్రాన్ని "సౌత్ కా ధమాకా" అని పేర్కొంది ఆమె. ఈ మూవీలో ఇంకా దునియా విజయ్, బ్రహ్మాజీ, విషు రెడ్డి, విటివి గణేష్ కూడా నటిస్తు్న్నారు.