బాలయ్య - కొరటాల.. వాటే కాంబో !
తాజా సోషల్ మీడియా అప్‌డేట్ ప్రకారం... కొరటాల శివ నందమూరి బాలకృష్ణను డైరెక్ట్ చేయబోతున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.;
‘ఆచార్య’ తర్వాత, కొరటాల శివ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ 'దేవర' సినిమా కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ యాక్షన్ డ్రామా సెకండాఫ్‌పై, కథనంపై విమర్శలు వచ్చినా.. ఎన్టీఆర్ స్టార్ పవర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా రాణించడానికి తోడ్పడింది. ఇటీవల.. కొరటాల శివ, నాగ చైతన్య కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాదని తెలిసింది.
తాజా సోషల్ మీడియా అప్‌డేట్ ప్రకారం... కొరటాల శివ నందమూరి బాలకృష్ణను డైరెక్ట్ చేయబోతున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం, దర్శకుడు బాలయ్యతో చర్చలు జరుపుతున్నాడని, అన్నీ కుదిరితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
కొరటాల శివ 'దేవర 2' పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్... ప్రశాంత్ నీల్ సినిమా 'డ్రాగన్' (వర్కింగ్ టైటిల్) తో బిజీగా ఉన్నాడు. అలాగే, ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్‌తో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. కాబట్టి 'దేవర 2' షూటింగ్ ఎప్పుడు మొదల వుతుందో క్లారిటీ లేదు. ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని, కొరటాల శివ 'దేవర 2' కంటే ముందుగా ఒక క్విక్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.