సిద్ధు స్టెప్పులతో దుమ్ము రేపుతోన్న ‘పబ్ లో నెరుడా’!
By : Surendra Nalamati
Update: 2025-03-07 11:49 GMT
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జాక్‘. ఈ సినిమాలో సిద్ధుకి జోడీగా ‘బేబి‘ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తుంది. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో ఆకట్టుకున్న ‘జాక్‘ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజయ్యింది.
అచ్చు రాజమణి మ్యూజిక్ లో వనమాలి రాసిన ‘పబ్ లో నెరుడా‘ అంటూ సాగే ఈ గీతాన్ని బెన్నీ దయాల్ ఆలపించారు. ఈ పాట యూత్ ఫుల్ గా ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకూ తన స్వాగ్ తో ఆకట్టుకున్న స్టార్ బాయ్ సిద్ధు.. ఈ పాటలో డ్యాన్సుల్లోనూ కుమ్మేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 10న ‘జాక్.. కొంచెం క్రాక్‘ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.