నమ్మకాన్ని పెంచుకుంటున్న నిర్మాత!
టాలీవుడ్‌లో నాని పేరు వినిపిస్తే సహజత్వం, కొత్తదనం అనేవి గుర్తుకొస్తాయి. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న నాని, నిర్మాతగా కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల నమ్మకాన్ని అందుకుంటూ వెళ్తున్నాడు.
‘అ!, హిట్, హిట్-2’ లాంటి విభిన్నమైన సినిమాలతో తన ప్రొడక్షన్ హౌస్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాని, ఇప్పుడు ‘కోర్ట్’ సినిమాతో మరోసారి తన క్రెడిబిలిటీని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా కథపైన, కంటెంట్‌పైన పూర్తి నమ్మకంతో ముందే ప్రీమియర్లు ఏర్పాటు చేసి, ప్రేక్షకులకు తన సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్‌ను చూపించాడు.
'కోర్ట్ నచ్చకపోతే నా హిట్-3 చూడొద్దు' అనే బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చిన నాని, ట్రోలింగ్ అనే భయమే లేకుండా సినిమా క్వాలిటీ మీద ఉన్న తన నమ్మకాన్ని అర్థమయ్యేలా చేశాడు. బుకింగ్‌ల పరంగా కూడా ఈ సినిమా విపరీతమైన స్పందన పొందుతుండటం, ప్రేక్షకుల్లో నాని ప్రొడ్యూసర్‌గా కూడానూ ఎంత క్రెడిబిలిటీ తెచ్చుకున్నాడో చెప్పడానికి నిదర్శనం.
ఈ విజయంతో నాని నిర్మాతగా మరో లెవెల్‌కి ఎదిగే అవకాశం కనిపిస్తోంది. 'కోర్ట్' విజయం, నాని ప్రొడక్షన్ హౌస్‌కి మరో మైలురాయి అవుతుందనడంలో సందేహం లేదు.