‘ఓజీ’ తర్వాత ప్రియాంక డిజిటల్ ఎంట్రీ?
సినిమా విడుదల కాకముందే ప్రియాంక మోహన్ దృష్టి ఇప్పుడు ఓటీటీ వైపు మళ్లింది. త్వరలో ఆమె కొత్త నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌లో నటించనుంది. ఇది ఆమెకు తొలి డిజిటల్ ప్రాజెక్ట్.;
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'ఓజీ' చిత్రంలో కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ భార్య కన్మణి పాత్రను పోషిస్తుండగా, ఆమెకు అభిమానుల నుండి భారీ మద్దతు లభిస్తోంది. సినిమా విడుదల కాకముందే ప్రియాంక మోహన్ దృష్టి ఇప్పుడు ఓటీటీ వైపు మళ్లింది. త్వరలో ఆమె కొత్త నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌లో నటించనుంది. ఇది ఆమెకు తొలి డిజిటల్ ప్రాజెక్ట్.
ఈ చిత్రానికి ఓ ప్రముఖ తమిళ దర్శకుడు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. 'ఓజీ' లాంటి భారీ సినిమా చేశాక కూడా ప్రియాంక ఓటీటీలోకి అడుగుపెడుతుంది. ఇప్పటి వరకు వెబ్ సిరీస్ కానీ, వెబ్ ఫిల్మ్ కానీ ఆమె చేయలేదు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
ప్రియాంక అరుల్ మోహన్ 'గ్యాంగ్ లీడర్', 'శ్రీకారం', మరియు 'సరిపోదా శనివారం' వంటి తెలుగు చిత్రాలలో నటించారు. 'ఓజీ' తర్వాత మరిన్ని పెద్ద తెలుగు ప్రాజెక్టులలో అవకాశాలు వస్తాయని ఆమె ఆశిస్తోంది.