డల్లాస్‌లో 'ఓజీ' సంబరాలు
అమెరికా నేలపై తొలిసారిగా 30 అడుగుల ఎత్తైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కటౌట్ ఆవిష్కరణతో డల్లాస్ నగరం సందడిగా మారింది. Cinemark Webb Chapel Theater వద్ద జరిగిన ఈ వేడుకను మెగా ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు.;
అమెరికా నేలపై తొలిసారిగా 30 అడుగుల ఎత్తైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కటౌట్ ఆవిష్కరణతో డల్లాస్ నగరం సందడిగా మారింది. Cinemark Webb Chapel Theater వద్ద జరిగిన ఈ వేడుకను మెగా ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు. మాషప్ పాటలు, వీడియోలు ప్రదర్శిస్తూ.. థియేటర్ బయటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వాతావరణం సృష్టించారు.
ప్రపంచంలోనే మొదటి టికెట్ డల్లాస్ మెగా ఫ్యాన్స్ దక్కించుకున్నారు. ఈ ఘనత కోసం సురేష్ లింగినేని, శ్రీధర్ లింగినేని, శ్రీరామ్ మాథి, బాబీ అడ్డా, కిషోర్ అనిచెట్టి ముఖ్య భూమిక పోషించారు. డాక్టర్ మణి, రాజేష్ కల్లేపల్లి కలిసి ఈ కటౌట్‌ను ఆవిష్కరించారు.
డల్లాస్ ఫ్యాన్స్ పవన్ ఫోటోతో ఉన్న టీ-షర్ట్స్ వేసుకుని 'అమ్మాయే సన్నగా' పాటకు డ్యాన్స్ చేస్తూ 'ఓజీ' మ్యానియాను స్టార్ట్ చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'ఓజీ' ప్రీమియర్స్ మొదలయ్యాయి.