‘ఓజీ’కి తెలంగాణ హైకోర్టు షాక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రంకు విడుదల ముందే పెద్ద షాక్ తగిలింది. బెనిఫిట్‌ షోలు, టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది.;

By :  S D R
Update: 2025-09-24 10:24 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రంకు విడుదల ముందే పెద్ద షాక్ తగిలింది. బెనిఫిట్‌ షోలు, టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ముందుగా సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ నిర్వహించేందుకు, ఒక్కో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి ₹800గా నిర్ణయించారు. అలాగే విడుదల రోజు నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో ₹100, మల్టీప్లెక్స్‌ల్లో ₹150 పెంపుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇకపోతే ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకుల్లో సందిగ్ధం నెలకొంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 10 రోజుల పాటు టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా రేపు (సెప్టెంబర్ 25న) గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా, తమన్ సంగీతం అందించాడు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News