ప్రభాస్ సినిమాలకు మళ్ళీ బ్రేక్ తప్పడం లేదు !

శారీరకంగా ప్రభాస్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డాక్టర్లు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.;

By :  K R K
Update: 2025-04-18 10:11 GMT

ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్ని ఒకేసారి లైన్ లో పెట్టుకున్నాడు. కానీ వివిధ కారణాలతో అతడి సినిమాల షూటింగ్‌లు ఆలస్యమవుతున్నాయి. మారుతి దర్శకత్వంలోని “ది రాజా సాబ్” సినిమా ఇప్పటికే మూడు సంవత్సరాలుగా షూటింగ్‌లో ఉంది. మధ్యలో అనేక సమస్యల కారణంగా సినిమా నిర్మాణం నిలిచిపోయింది.

హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న (ప్రస్తుతం 'ఫౌజీ' అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు) మరో సినిమాకు కూడా షూటింగ్ బ్రేక్ వచ్చింది. షూటింగ్ షెడ్యూళ్స్ నుంచి తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నారు. ఇంకా “స్పిరిట్” సినిమా షూటింగ్ మొదలు కూడా కాలేదు. మరోవైపు.. శారీరకంగా ప్రభాస్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డాక్టర్లు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నిరంతరం పని కారణంగా ఆయన మోకాళ్ళలో మళ్లీ సమస్యలు తలెత్తినట్లు సమాచారం.

దీంతో... ప్రభాస్ తన ఫేవరేట్ హాలిడే డెస్టినేషన్ అయిన ఇటలీలోని ఒక గ్రామానికి వెళ్ళేందుకు సిద్దమవుతున్నాడు. అక్కడ కొన్ని వారాలు విశ్రాంతి తీసుకుని.. మానసికంగా, శారీరకంగా, ఉల్లాసంగా మారి తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం అతడి అభిమానులు, సినిమాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఈ విరామం తర్వాత ప్రభాస్ పూర్తి శక్తితో తిరిగి వస్తాడని ఆశిస్తున్నారు.

Tags:    

Similar News