రీరిలీజ్ కానున్న వెంకీ కల్ట్ క్లాసిక్ !

త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మాటలు, కె. విజయ భాస్కర్ డైరెక్షన్.. ఈ సినిమాని తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ కామెడీగా నిలబెట్టాయి.;

By :  K R K
Update: 2025-10-09 12:27 GMT

ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎప్పటికీ నచ్చే అద్భుతమైన కామెడీ ఎంటర్ టైనర్ "నువ్వు నాకు నచ్చావ్". ఈ సినిమా జనవరి 1, 2026 నాడు 4K క్వాలిటీతో మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ కల్ట్ కామెడీ క్లాసిక్.. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మాటలు, కె. విజయ భాస్కర్ డైరెక్షన్.. ఈ సినిమాని తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ కామెడీగా నిలబెట్టాయి.

త్రివిక్రమ్ పంచులు, వెంకటేష్ కామెడీ టైమింగ్ అయితే అస్సలు మర్చిపోలేం. ఈ సినిమాలోని ఎమోషన్ ఇప్పటికీ, అంటే దాదాపు 25 ఏళ్ల తర్వాత కూడా కనెక్ట్ అవుతూనే ఉంటుంది. గతంలో ఓవర్సీస్‌లో కేవలం యూఎస్ఏ లో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు తొలిసారిగా ఆస్ట్రేలియా, యూకే, యూరప్ లాంటి ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో కూడా పెద్ద ఎత్తున విడుదల కానుంది.

స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్.. నిర్మించిన ఈ సినిమాకి సంగీతం కోటి అందించారు. ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌లకు "నువ్వు నాకు నచ్చావ్" ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. ఈ 4కే రీ-రిలీజ్ ద్వారా మళ్లీ మూడు గంటలపాటు నవ్వులు, పాత జ్ఞాపకాలు పంచుకోవచ్చు. 2026 కి స్వాగతం చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ వే అని చెప్పొచ్చు.

Tags:    

Similar News