జెప్టో యాడ్‌తో ఎన్టీఆర్ మాస్ అట్రాక్షన్
‘ఆర్ఆర్ఆర్, దేవర’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ క్రేజ్ కొత్త స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం తారక్ బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ ‘వార్ 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రశాంత్ నీల్ తో 'డ్రాగన్' కూడా లైన్లో ఉంది. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతోనూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. లేటెస్ట్ గా ఎన్టీఆర్ మరో ఆసక్తికరమైన యాడ్‌లో కనిపించి అభిమానులను అలరిస్తున్నాడు.
జెప్టో అనే ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థ కోసం ఎన్టీఆర్ చేసిన ఈ యాడ్ విభిన్నంగా ఆకట్టుకుంటోంది. మూసధోరణిలో సాగే యాడ్‌లకు భిన్నంగా, ఇందులో ఎన్టీఆర్ వినోదభరితంగా కనిపించాడు. ఫ్రిజ్‌లో కూర్చోవడం, వాషింగ్ మెషీన్‌లో ఉండినట్లు నటించడం వంటి వినూత్న శైలిలో ఈ యాడ్ రూపొందించబడింది. 'ఇది జెప్టో సూపర్ సేవర్ అండీ, ధరలు చాలా తక్కువ.. ఒకసారి చూసేయండి!' అంటూ ఈ యాడ్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు దీనిని తెగ షేర్ చేస్తూ, ఆయన హావభావాలను, కామెడీ టైమింగ్‌ను ప్రశంసిస్తున్నారు. బ్రాండ్ ప్రమోషన్‌లో కొత్తదనం కోరుకునే యాడ్ మేకర్స్‌కు ఇది ఒక బెంచ్‌మార్క్‌లా మారిందని చెప్పొచ్చు. సినీ ప్రపంచంలో ఎన్టీఆర్ స్థాయి పెరుగుతున్నట్లు ఈ కమర్షియల్ మరోసారి నిరూపించింది.