విజన్, వెర్సటాలిటీ ఉన్న అరుదైన ఫిల్మ్ మేకర్ రిషభ్ శెట్టి : యన్టీఆర్

ఎన్టీఆర్ ఆయనను విజన్, వెర్సటాలిటీ ఉన్న అరుదైన ఫిల్మ్‌మేకర్‌గా ప్రశంసించారు. రిషబ్ కేవలం డైరెక్షన్ లేదా యాక్టింగ్‌లోనే కాదు, సినిమా నిర్మాణంలోని ప్రతి అంశంపై మంచి కమాండ్ ఉందని ఆయన అన్నారు.;

By :  K R K
Update: 2025-09-29 01:04 GMT

“కాంతార: చాప్టర్ 1” ప్రీ-రిలీజ్ వేడుకలు తాజాగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగాయి. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరవడం ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. వేదికపై మాట్లాడిన దర్శకుడు, లీడ్ యాక్టర్ రిషబ్ శెట్టి.. తెలుగు రాష్ట్రాల ప్రజలు తనపై చూపించిన ప్రేమకు చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. “నాకిది ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తోంది,” అని ఆయన చెప్పారు. “ఇంత మంది రావడం చాలా హార్ట్‌వార్మింగ్‌గా ఉంది..” అని తెలిపారు.

ఈ ఈవెంట్‌కి టైమ్ కేటాయించి వచ్చిన ఎన్టీఆర్‌కు ఆయన మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పారు. ఇటీవల గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. చిన్నప్పుడు తన నానమ్మ చెప్పిన జానపద కథల గురించి ముచ్చటించారు. “నాకు ఎప్పుడూ ఆ కథల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. ఈ గుళిగ నృత్యం అంటే ఏంటి? పంజుర్లీలు ఎవరు? వాటిని లైఫ్‌లో ఒక్కసారైనా చూడాలని అనిపించేది. ఆ క్యూరియాసిటీ చాలా ఏళ్లు నాలో ఉంది, అది రిషబ్ శెట్టి ‘కాంతార’తో తీరిపోయింది,” అని ఆయన అన్నారు.

రిషబ్ శెట్టి టాలెంట్‌ను మెచ్చుకుంటూ, ఎన్టీఆర్ ఆయనను విజన్, వెర్సటాలిటీ ఉన్న అరుదైన ఫిల్మ్‌మేకర్‌గా ప్రశంసించారు. రిషబ్ కేవలం డైరెక్షన్ లేదా యాక్టింగ్‌లోనే కాదు, సినిమా నిర్మాణంలోని ప్రతి అంశంపై మంచి కమాండ్ ఉందని ఆయన అన్నారు. “కాంతార చాప్టర్ 1” సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

Tags:    

Similar News