చరణ్ ట్యాగ్ మారింది
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్'తో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు వచ్చిన గుర్తింపే ఆ ట్యాగ్‌కు కారణం. చరణ్ గత చిత్రం 'గేమ్ ఛేంజర్' కోసం గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను వాడారు.;
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్'తో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు వచ్చిన గుర్తింపే ఆ ట్యాగ్‌కు కారణం. చరణ్ గత చిత్రం 'గేమ్ ఛేంజర్' కోసం గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను వాడారు. కానీ.. లేటెస్ట్ గా ఆ ట్యాగ్ కు దూరం కావాలని నిశ్చయించుకున్నాడు రామ్ చరణ్.
'గేమ్ ఛేంజర్' తీవ్రంగా నిరాశపరచడంతో గ్లోబల్ స్టార్ ట్యాగ్ నుంచి మళ్లీ మెగా పవర్ స్టార్ కి వచ్చేశాడు. లేటెస్ట్ గా రామ్ చరణ్ ఇండస్ట్రీలో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పెద్ది’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజయ్యింది. ఈ పోస్టర్‌లో మళ్లీ పాత ట్యాగ్ ‘మెగా పవర్ స్టార్’నే కనిపించింది. దీంతో రామ్ చరణ్ మళ్లీ పాత రూట్‌నే ఫాలో అవుతున్నాడా? లేకపోతే ఇది కేవలం 18 ఏళ్ల సినీ ప్రయాణానికి గుర్తుగా మేకర్స్ పెట్టిన ట్యాగ్ మాత్రమేనా? అనే ఆసక్తికరమైన చర్చ అభిమానుల్లో మొదలైంది.
ఇక టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో ‘పెద్ది’ ఒకటి. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ అండ్ రస్టిక్ డ్రామా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది.