నేచురల్ స్టార్ టు కల్ట్ మాస్ హీరో!

Update: 2025-03-05 04:27 GMT

నాని అంటే ఇప్పటివరకు అందరికీ తెలిసిన చక్కటి ఫ్యామిలీ హీరో. అతని నటనలో సహజత్వం, పాత్రల ఎంపికలో వినూత్నత, ప్రేక్షకులతో కలిగించే అనుబంధం కారణంగా నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా నాని తన లోపలి నటుడ్ని కొత్త కోణంలో ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ, విభిన్నమైన పాత్రలతో ముందుకు సాగుతున్నాడు.

అంతకుముందు తన ఇమేజ్‌కు భిన్నంగా కొన్ని సినిమాలు చేసినా నిజమైన టర్నింగ్ పాయింట్ ‘దసరా’ సినిమాతో వచ్చింది. సంపూర్ణ మాస్ లుక్‌తో, మునుపెన్నడూ చూడని రానెస్‌తో నాని ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని కలిగించాడు. 'దసరా' ఘన విజయాన్ని అందించింది. 'దసరా' మాస్ అప్పీల్‌ను ఆ తర్వాత 'సరిపోదా శనివారం'కు ఉపయోగించుకున్నాడు. 'హిట్ 3'లోనూ అదే మాస్ ను కంటిన్యూ చేస్తున్నాడు.

ఇటీవల రిలీజైన ‘హిట్ 3’ టీజర్ లో ఊర మాస్ గా కనిపించాడు నేచురల్ స్టార్. పర్ఫెక్ట్ కల్ట్ మాస్ హీరోగా ఎదగడానికి నాని చేస్తున్న మరో ప్రయత్నం 'హిట్ 3' అని చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా రిలీజైన 'ది ప్యారడైజ్' గ్లింప్స్ మరో లెవెల్. ‘ప్యారడైజ్’ గ్లింప్స్ లో నాని మేకోవర్ నెవర్ బిఫోర్. రెండు, మూడేళ్ల క్రితం వరకూ నానిని ఇలాంటి తరహా పాత్రల్లో ఊహించడం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నాని తన నటనా పరిధిని విస్తరించుకునే పనిలో ఉన్నాడు.

నటుడిగా ఎదగాలంటే ఒకే రకమైన పాత్రలతో పరిమితం కాకూడదు. ఒకే ఇమేజ్‌లో ఇరుక్కుపోతే దశలు మారిన కొద్దీ ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆశిస్తారు. నాని ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే, అతను తనను తాను ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ, విభిన్న కథలను అంగీకరిస్తూ, దర్శకులకు కూడా తనతో ప్రయోగాలు చేయడానికి అవకాశం కల్పిస్తున్నాడు.

Tags:    

Similar News