‘ది ప్యారడైజ్’లో నారాయణమూర్తి.. ?
పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి విప్లవాత్మక సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా, దర్శకుడిగా ఎన్నో విజయాలు సాధించిన ఆయన, కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ, సందేశాత్మక చిత్రాలకే కట్టుబడి ఉన్నారు. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసే అవకాశాలు వచ్చినా ఆయన తిరస్కరిస్తూ వస్తున్నారు.
అయితే ఇప్పుడు నారాయణమూర్తి వేరే హీరో సినిమాల్లో నటించబోతున్నారా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్'లో నారాయణమూర్తి కీలక పాత్రలో నటించనున్నారు న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది. అందుకు ప్రధాన కారణం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అండ్ టీమ్ తో నారాయణమూర్తి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడమే.
కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండే ఆర్. నారాయణమూర్తి నిజంగా ఈ సినిమాలో నటిస్తారా? లేక మరోసారి తన సిద్ధాంతాలకు కట్టుబడి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయనని చెప్పేసారా? అనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఒకవేళ ఆయన ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తే, సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే నారాయణమూర్తి క్యారెక్టర్ యాక్టర్ గా బిజీ అయ్యే అవకాశాలూ పుష్కలంగా ఉంటాయి.