మే 1 .. కేరాఫ్ వయోలెన్స్ !
సౌత్ లో ఒక ఆసక్తికరమైన వార్ ను ఆడియన్స్ ఆసక్తిగా చూడబోతున్నారు. అదే మే 1న విడుదలవుతున్న రెండు భారీ సినిమాలు. ఒకటి తెలుగు నుంచి, మరొకటి తమిళం నుంచి.;
బాలీవుడ్ లో ‘కిల్’, మలయాళంలో ‘మార్కో’ సినిమాలు విజయం సాధించ డంతో.. హింసను ఆధారంగా చేసుకున్న సినిమాలకు మళ్లీ మార్కెట్ తెరుచుకుంది. ఈ విజయాలతో ఇన్స్పైర్ అయిన మరికొందరు దర్శకులు ఇప్పుడు ఇలాంటి కథలపై ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్క్రీన్ మీద హింసకు కొత్త పరిమితులు చేరుస్తూ.. ఈ తరహా చిత్రాల్లోని కథనాలు ప్రధానంగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో సౌత్ లో ఒక ఆసక్తికరమైన వార్ ను ఆడియన్స్ ఆసక్తిగా చూడబోతున్నారు. అదే మే 1న విడుదలవుతున్న రెండు భారీ సినిమాలు. ఒకటి తెలుగు నుంచి, మరొకటి తమిళం నుంచి. ఈ రెండు చిత్రాలు కూడా ఆయా ఇండస్ట్రీస్ లో క్రేజీ హీరోల సినిమాలు కావడం విశేషం.
వీటిలో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా నేచురల్ స్టార్ నానీ నటించిన ‘హిట్ 3’. ఈ చిత్రం ప్రధానంగా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయినప్పటికీ.. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే దాంతోపాటు హింస కూడా గట్టిగా ఉండబోతోందని అర్ధమవుతోంది. ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. ‘నేచురల్ స్టార్’ అనే తన హుందా ఇమేజ్‌ను వదిలేసి, నాని ఇప్పుడు మేచ్యూర్డ్ యాక్షన్ హీరోగా మారుతున్నాడు. గతంలో ‘దసరా’ విజయంతో ఆయన కెరీర్‌లో మార్పు వచ్చింది. అదే దిశగా ఇది మరో కీలక ప్రయోగంగా చెప్పొచ్చు. ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక రెండవది.. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ చిత్రం. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్. తెలుగు లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. పోస్టర్లు, టీజర్ చూస్తుంటే.. ఇది కూడా ఒక రక్తపాతం నిండిన కథ అని అర్ధమవుతోంది. యాక్షన్ అభిమానుల కోసం స్పెషల్ ట్రీట్ లా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలవడం వల్ల.. హింసాత్మక కథలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇద్దరు స్టార్ హీరోల ప్రయోగాలు, కమర్షియల్ వయోలెన్స్ కు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో మే 1న స్పష్టమవుతుంది.