అడ్వాన్స్ సేల్స్ లో అదరగొడుతోంది !

నానీ హిట్ 3 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత బలమైన అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్‌ను చూపిస్తోంది, ఇది గత కొన్ని రోజులలో ఈ చిత్రం సాధిస్తున్న ఫిగర్స్ ద్వారా స్పష్టమవుతోంది.;

By :  K R K
Update: 2025-04-30 00:33 GMT

ఈ రోజుల్లో.. సినిమాల విడుదలకు ముందు టిక్కెట్ బుకింగ్ ట్రెండ్‌ ప్రేక్షకులలో ఉన్న ఆసక్తి, ఆశలను సూచిస్తాయి. ఈ నేపథ్యంలో... నాని లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ విషయంలో ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత బలమైన అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్‌ను చూపిస్తోంది, ఇది గత కొన్ని రోజులలో ఈ చిత్రం సాధిస్తున్న ఫిగర్స్ ద్వారా స్పష్టమవుతోంది.

‘హిట్3’ సాధిస్తున్న అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ సాధారణ స్థాయిని దాటి అసాధారణంగా ఉన్నాయి. ఈ ట్రెండ్ చాలా అడ్వాంటేజ్ గా కనిపిస్తోంది. విడుదలకు రెండు రోజుల ముందు సినిమాల అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్‌లను పరిశీలిస్తే.. ఈ చిత్రం సాధారణ స్థాయిని మించి ప్రదర్శన చేస్తోందని.. ఇటీవలి ఇతర చిత్రాలను కూడా మించిపోతోందని అర్థమవుతోంది.

నానిపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం, అలాగే ప్రమోషనల్ మెటీరియల్ ద్వారా సృష్టించబడిన హైప్ , ఆసక్తి.. అడ్వాన్స్ బుకింగ్‌లలో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఇంకొక్క రోజులో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న ‘హిట్ 3’ మూవీ నానీ కెరీర్ ను పీక్స్ తీసుకెళ్ళే అసాధరణ చిత్రం అవుతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా అందరి అంచనాల్ని ఎలా అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News