ఇండియాలోనే మోస్ట్ పాప్యులర్ స్టార్ నానీ !

జూన్ నెలలో ఆర్మాక్స్ ఆల్-ఇండియా టాప్ 10 మేల్ ఫిల్మ్ స్టార్స్ లిస్ట్‌లో స్థానం సంపాదించాడు.;

By :  K R K
Update: 2025-07-19 02:40 GMT

నేచురల్ స్టార్ నాని తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్‌ను ‘కోర్ట్ , హిట్ 3’ లాంటి వరుస బ్లాక్‌బస్టర్‌లతో తిరిగి ఉత్తేజపరిచాడు. ‘కోర్ట్’ సినిమాను నిర్మించ డమే కాకుండా.. ‘హిట్ 3’ లో అద్భుతమైన నటనతో మెప్పించాడు. అంతేకాదు, ‘ది ప్యారడైస్’ మూవీ గ్లింప్స్‌తో అతను అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాడు. దీంతో.. జూన్ నెలలో ఆర్మాక్స్ ఆల్-ఇండియా టాప్ 10 మేల్ ఫిల్మ్ స్టార్స్ లిస్ట్‌లో స్థానం సంపాదించాడు.

‘హిట్ 3’ మూవీలో నానీ నటన ఓటీటీ రిలీజ్ తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు పొందగా.. ‘ది ప్యారడైస్’ గ్లింప్స్‌లో అతని లుక్ దేశమంతా ఆకర్షించింది. తెలివైన ఎంపికలతో అతని పాపులారిటీ నిలకడగా పెరుగుతోందని ఇది చూపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని తన తదుపరి భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ లో నటిస్తున్నాడు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమ కూరుస్తున్నాడు. ప్రస్తుతం, నాని హైదరాబాద్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో యాక్షన్ స్టంట్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతున్నాయి.

ప్రభాస్, అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, తలపతి విజయ్, అజిత్, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్స్‌తో కూడిన.. ఆర్మాక్స్ ఆల్-ఇండియా టాప్ 10 మేల్ ఫిల్మ్ స్టార్స్ లిస్ట్‌లో నాని చేరడం అంటే సాధారణ విజయం కాదు. అతని స్థిరమైన ప్రయత్నాలు భారీ ఫలితాలను ఇస్తున్నాయి, ఇది నిజంగా ఫ్యాన్స్ గర్వించదగ్గ విషయమే.

Tags:    

Similar News