నానీ సినిమాలో మోహన్ బాబు !
లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు నాని.. 'ప్యారడైస్'లో కీలకమైన రోల్‌లో కనిపించబోతున్నారని కన్ఫర్మ్ చేశారు. ఈ వెటరన్ స్టార్ ఈ పాత్ర కోసం మామూలు ఉత్సాహంగా లేరు. ఫుల్ జోష్‌లో ఉన్నారట.;
నాచురల్ స్టార్ నాని కెరీర్‌లోని అత్యంత భారీ ప్రాజెక్ట్ 'ప్యారడైస్' అని అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఫుల్ స్పీడ్‌లో ఉంది. కాస్టింగ్ టీమ్ రాత్రింబవళ్లు నటీనటులను ఫైనలైజ్ చేయడానికి కసరత్తులు చేస్తోంది. ఇలాంటి హై వోల్టేజ్ మూమెంట్‌లో.. ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అది కూడా 'కన్నప్ప' సినిమా డైరెక్టర్ ముకేష్ కుమార్ నుంచి.
ముకేష్ కుమార్ ఒక బిగ్ బాంబ్ డ్రాప్ చేస్తూ.. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు నాని.. 'ప్యారడైస్'లో కీలకమైన రోల్‌లో కనిపించబోతున్నారని కన్ఫర్మ్ చేశారు. ఈ వెటరన్ స్టార్ ఈ పాత్ర కోసం మామూలు ఉత్సాహంగా లేరు. ఫుల్ జోష్‌లో ఉన్నారట. ఇప్పటికే ఆయన ఈ రోల్ కోసం హార్డ్‌కోర్ ప్రిపరేషన్ మొదలెట్టేశారని ముకేష్ రివీల్ చేశారు. ఇది వినగానే ఫ్యాన్స్‌లో హైప్ ఆల్రెడీ స్కైలెవెల్‌కు వెళ్లిపోయింది.
ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే. నానీ.. 'కన్నప్ప' సినిమా షూటింగ్‌లోని కొన్ని సీన్స్‌ను చూసే అవకాశం వచ్చిందట. మోహన్ బాబు స్క్రీన్‌పై చూపించిన డైనమిక్ పెర్ఫార్మెన్స్‌ను చూసి నాని ఫ్లాట్ అయిపోయాడని తెలుస్తోంది. మోహన్ బాబు ఆ ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ చూసి నాని గట్టిగా ఇంప్రెస్ అయ్యాడట. ఇది ఒక్క నానినే కాదు.. 'ప్యారడైస్' టీమ్ అంతా మోహన్ బాబును బోర్డ్‌పైకి తీసుకురావాలని డిసైడ్ చేసేలా చేసింది.
'ప్యారడైస్' సినిమా.. మోహన్ బాబు లాంటి హెవీ వెయిట్ యాక్టర్‌కు ఫర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే స్క్రిప్ట్ అని, ఆ పాత్రను ఎగ్జిక్యూట్ చేయడానికి సరైన ఐడియా, విజన్ దానికి ఉన్నాయని టాక్. ఇదే కారణంగా మోహన్ బాబు ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈ సినిమా కథ, మోహన్ బాబు లాంటి సీనియర్ స్టార్‌కు ఫుల్ జస్టిస్ చేసేలా డిజైన్ చేయబడిందని, ఆయన టాలెంట్‌ను సరిగ్గా హైలైట్ చేసే పాత్ర ఇందులో ఉందని ఇన్‌సైడ్ టాక్. మరి మోహన్ బాబు ప్యారడైజ్ లో ఏ తరహా పాత్రలో నటిస్తు్న్నారో చూడాలి.