ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన నాగవంశీ

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత నాగవంశీ వరుసగా విజయవంతమైన సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు.;

By :  S D R
Update: 2025-08-20 11:52 GMT

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత నాగవంశీ వరుసగా విజయవంతమైన సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. ఒకవైపు నిర్మాతగా బిజీగా ఉంటూనే మరోవైపు పంపిణీదారుడిగానూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు నాగవంశీ. ఈకోవలోనే బాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ 'వార్ 2'ని తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో విడుదల చేశారు.

హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాగవంశీ 'ఈ సినిమా మీకు నచ్చకపోతే ఇకపై మైక్ పట్టుకుని సినిమా గురించి మాట్లాడను' అంటూ హైప్ పెంచారు. అయితే, విడుదలైన మొదటి రోజు నుంచే 'వార్ 2' మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడంతో, తెలుగు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు తగ్గ రీతిలో ఆడలేదు.

తెలుగు హక్కులను నాగవంశీ దాదాపు రూ.80 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమా అంచనాలను అందుకోకపోవడంతో ఆయనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. 'డబ్బులు పోయి దుబాయ్ పారిపోయాడు, ఇళ్లు అమ్మేశాడు, ఇక సినిమాలు ఆపేస్తాడు' అంటూ పలు రకాల రూమర్స్ వెలువడ్డాయి. ముఖ్యంగా ఏపీలో రాజకీయ కారణాల వల్ల కూడా కొన్ని వర్గాలు ఈ సినిమాపై నెగిటివ్ క్యాంపైన్ నడిపినట్లు టాక్ వినిపించింది.

ఈ నేపథ్యంలో నాగవంశీ తాజాగా తన ‘X’ అకౌంట్ వేదికగా రియాక్ట్ అయ్యారు. 'ఏంటీ నన్ను చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు.. వంశీ అది, వంశీ ఇది అని గ్రిప్పింగ్ కథనాలతో ఫుల్ హడావిడి నడుస్తుంది. పర్లేదు, ఇక్కడ మంచి రైటర్స్ ఉన్నారు. మిమ్మల్నందరినీ నిరుత్సాహపరిచినందుకు క్షమించండి. కానీ ఇంకా ఆ సమయం రాలేదు. కనీసం ఇంకో 10-15 సంవత్సరాలు ఉంది. మా తదుపరి విహారయాత్ర 'మాస్ జాతర'తో చాలా త్వరలోనే కలుసుకుందాం' అంటూ గట్టి సమాధానం ఇచ్చారు. నాగవంశీ వేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు 'స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ కూడా ప్రొఫెషనల్‌గా వ్యవహరించి, నాగవంశీకి కొంత ఉపశమనం కల్పించినట్లు సమాచారం. తెలుగులో వచ్చిన లాసెస్‌ను తగ్గించేందుకు దాదాపు రూ.22 కోట్లు రీఫండ్ ఇవ్వడానికి వారు అంగీకరించారట.



Tags:    

Similar News