టైటిల్ రివీల్ అయ్యేది అప్పుడే !
తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న సినిమా టైటిల్‌ను వెల్లడించనున్నారు. అలాగే, రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.;
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ తర్వాత అనిల్‌పై భారీ అంచనాలున్నాయి, కాబట్టి ఈ సరదా సినిమాపై కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న సినిమా టైటిల్‌ను వెల్లడించనున్నారు. దీనికి "మన శంకర్ ప్రసాద్" (పండక్కి వస్తున్నాడు) అని ఫిల్మ్ సర్కిల్ లో టాక్ జోరుగా వినిపిస్తోంది. అలాగే, రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదలవుతుందని ఇప్పటికే ధృవీకరించారు. తాజా టాక్ ప్రకారం.. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కూడా సంక్రాంతి రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్లాష్ జరుగుతుందో లేదో చూడాలి.
చిరు-అనిల్ ప్రాజెక్ట్, తాత్కాలికంగా ‘మెగా 157’గా పిలుస్తున్న ఈ సినిమాను సాహు గరపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై, సుష్మిత కొనిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. మరి మెగా 157 కోసం ఏ టైటిల్ ను ఫిక్స్ చేయబోతారో చూడాలి.