నితిన్ కు జోడీగా బుట్టబొమ్మ?
ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో నితిన్‌కి జోడీగా పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇప్పటికే ఈ స్టార్ హీరోయిన్‌తో చర్చలు మొదలైనట్లు సమాచారం.;
యంగ్ స్టార్ హీరో నితిన్ తన కెరీర్‌లో ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ముఖ్యంగా.. అతని రీసెంట్ రెండు చిత్రాలు, తమ్ముడు, రాబిన్‌హుడ్.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. ఇక అతని లైనప్‌లో వేణు ఏల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’, విక్రమ్ కే. కుమార్‌తో ఒక స్పోర్ట్స్ డ్రామా ఉన్నాయి.
ప్రెజెంట్ .. విక్రమ్ కే. కుమార్ సినిమాలో నితిన్ హార్స్ రైడర్ గా కనిపించ నున్నాడని.. ఈ చిత్రానికి ‘స్వారీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇంక ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో నితిన్‌కి జోడీగా పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇప్పటికే ఈ స్టార్ హీరోయిన్‌తో చర్చలు మొదలైనట్లు సమాచారం.
ఈ సినిమా నితిన్ అండ్ విక్రమ్ కే. కుమార్‌ల రెండో కొలాబరేషన్. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘ఇష్క్’ రొమాంటిక్ డ్రామా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి.. నితిన్ కెరీర్‌కే కొత్త ఊపిరి పోసింది. ఈ కాంబో మళ్లీ ఇష్క్ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తుందని, పూజా హెగ్డే తో అతని కెమిస్ట్రీ పెర్ఫెక్ట్ గా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారు.